prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 3:51 pm Digital Edition : PRAJA VANI

దండేపల్లిలో మండలస్థాయి సమావేశం

దండేపల్లిలో మండలస్థాయి సమావేశం
గ్రామాల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి
దండేపల్లి, అక్టోబర్ 23 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండలస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిథులుగా లక్షెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, నెర్కివెంకటాపూర్ పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రామాల్లో విద్యుత్ కొరతపై చర్చ
ఈ సమావేశంలో దండేపల్లి మండలంలోని వివిధ గ్రామపంచాయతీల పరిధిలో నెలకొన్న విద్యుత్ కొరత సమస్యను ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సమావేశంలో విజ్ఞప్తి చేశారు.
దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తూ, విద్యుత్ సమస్యలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
గ్రామపంచాయతీల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు కోరారు.