prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 1:39 pm Digital Edition : PRAJA VANI

దండేపల్లిలో ఘనంగా నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ హాల్ ప్రారంభం
దండేపల్లి, అక్టోబర్ 16 (ప్రజావాణి):
దండేపల్లి మండల నూతన ప్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ హాల్‌ను శుక్రవారం లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత పురోహితులు సంతోష్ అయ్యగారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ మాధంశెట్టి మల్లికార్జున్‌తో పాటు సభ్యులు కొండూ జనార్దన్, బోలిశెట్టి రాజన్న, కొండూ రామన్నలు రిబ్బన్ కట్ చేసి నూతన ప్రెస్ క్లబ్ హాల్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దండేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుంచె ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శేర్ల చక్రపాణి, తోట్ల మల్లేష్, బచ్చల సుభాష్, కుర్సెంగ అరుణ్ కుమార్, బొడ్డు జగన్, ముత్తే రమేష్, బుర్ర తిరుపతి, అత్తే సుధాకర్, కే. మల్లేష్, కొల్లూరి సతీష్, ఏనుముల తిరుపతి, వేణుగోపాల్, సంతపురి కిషోర్ తదితర ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
పాత్రికేయులకు సౌకర్యవంతమైన వేదిక
నూతన ప్రెస్ క్లబ్ హాల్ ప్రారంభంతో దండేపల్లి మండల పాత్రికేయులకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, వివిధ ప్రజా సమస్యలపై చర్చించుకోవడానికి అనుకూలమైన వేదిక అందుబాటులోకి వచ్చింది. ఈ హాల్ మండలంలో పాత్రికేయుల ఐక్యతకు, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు