prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 9:46 am Digital Edition : PRAJA VANI

తౌషీక్ – మౌలాబీ మరణాలతో నాకు సంబంధంలేదు మాగుంట

తౌషీక్ – మౌలాబీ మరణాలతో నాకు సంబంధంలేదు మాగుంట

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో అక్టోబర్ 10

శింగరాయకొండ గ్రామంలోని శ్రీ చైతన్య నవోదయ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్ధి, తౌషీక్ ఇటీవల మృతిచెందడం జరిగింది. ఆ విద్యార్ధి మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడంలో నా పాత్ర వుందని యం.ఆర్.పి.ఎస్. వ్యవస్తాపక అధ్యక్షుడు, మంద కృష్ణ మాదిగ మీడియా సమావేశాలలో చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదు. శ్రీ చైతన్య నవోదయ విద్యా సంస్థతో నాకు ఎలాంటి సంబంధం లేదు.

ఆ యాజమాన్యాన్ని కాపాడవలసిన అవసరం అంతకంటే నాకు లేదు. విద్యార్ధి మృతి కేసును తారుమారు చేయుటకు నేను ఎవరకీ శిఫార్సు చేయలేదు.

మా మాగుంట కుటుంబం గురించి ప్రకాశం జిల్లా ప్రజలందరికి తెలుసు. మా అన్న కీ. శే. శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలను కొనసాగించేందుకే మా మాగుంట కుటుంబం రాజకీలలోవున్నది ప్రజలకు సేవ చేయటమే మా మాగుంట కుటంబ లక్ష్యం. ప్రజల ఆదరణ – ఆశీస్సులతోనే మా కుటుంబం మూడు దశాబ్దాలకు పైగా జిల్లాలో రాజకీయం చేస్తూ, ప్రజలకు సేవలు చేస్తుందని పత్రికా ముఖంగా తెలిజేయుచున్నాను. అసత్య ఆరోపణలు చేసే ముందు మా కుటుంబ నేపద్యం తెలుసుకొని మాట్లాడాలి. తౌషీక్ మరణంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చాలని మాగుంట కుటుంబం కోరుతున్నది.