prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 3:52 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

తోటకూర శ్రీనివాస్ యాదవ్‌కు పవనపుత్ర హనుమాన్ యూత్ ఘన సన్మానం

ఘట్‌కేసర్, అక్టోబర్ 25 (ప్రజావాణి): ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్‌లో పవనపుత్ర హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నూతనంగా జనరల్ సెక్రటరీగా ఎన్నికైన తోటకూర శ్రీనివాస్ యాదవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యువకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు తీర్పుల వెంకటేష్, ఈదుగల్ల ప్రవీణ్‌,మహేష్, బిజిలి బాబు, కళ్యాణ్, నరసింహ, పొట్టిపల్లి పాండు, నిరుడు బిక్షపతి, లింగం, మంత్రి రమేష్, పొట్టిపల్లి జనార్దన్, నిరుడు నవీన్, కళ్లెం సాయి తదితరులు పాల్గొన్నారు.