prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 7:28 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

తొర్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

తొర్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

*స్థానిక ప్రజల నుండి విశేష స్పందన*

*ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపీఎస్*

తొర్రూర్
అక్టోబర్ 29 (ప్రజావాణి)

పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా తొర్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. రక్తదాన శిబిరంలో
130 యూనిట్ల రక్తం సేకరించడం జరిగింది.
పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా తొర్రూరులోని లయన్స్ క్లబ్ వేదికగా గురువారం మెగా రక్తదాన శిబిరానికి జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు 120 యూనిట్ల రక్తాన్ని సేకరించారు
తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఈ శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, యువత, పౌరులు, మీడియా ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొర్రూరు సబ్ డివిజన్‌కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. అమరవీరుల సంస్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అమరవీరుల త్యాగస్ఫూర్తిని సమాజానికి చాటిచెప్పడంతో పాటు ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
రక్తదానం అత్యంత గొప్ప మానవతా సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని ఎస్పీ అన్నారు. ఆరోగ్యపరమైన అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని, ముఖ్యంగా యువత సామాజిక బాధ్యతతో ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు పౌరులు, యువత, మీడియా ప్రతినిధుల నుంచి లభిస్తున్న స్పందన అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. అదేవిధంగా మెగా రక్తదాన శిబిరానికి అవసరమైన సహకారం, సదుపాయాలను అందించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్; లయన్స్ క్లబ్, తొర్రూరు; అమ్మ హాస్పిటల్, తొర్రూరుప్రతినిధులను జిల్లా ఎస్పీ ప్రశంసించారు. కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేసిన తొర్రూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరం ద్వారా 120 యూనిట్ల రక్తాన్ని సేకరించడం విశేషం అన్నారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటమే కాకుండా సమాజంలో మానవతా విలువలను పెంపొందించవచ్చని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, స్థానిక డిఎస్పి కృష్ణ కిషోర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, గణేష్ ఎస్సైలు మహేందర్ రెడ్డి, ఖాదర్ పాష, బానోత్ వెంకన్న, గండ్రతి సతీష్, ప్రమోద్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.