తొర్రూరు అగ్రి ప్రైవేట్ ఎంప్లాయీస్ నూతన కమిటీ ఎన్నిక
తొర్రూరు, అక్టోబర్ 15 (ప్రజావాణి): తొర్రూరు మండల కేంద్రంలో ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ రంగంలో పనిచేస్తున్న ప్రైవేట్ అగ్రి ఎంప్లాయీస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా ఇండోఫిల్ కంపెనీకి చెందిన పాల బిందెల రవిని, ఉపాధ్యక్షుడిగా ఎరిస్ కంపెనీకి చెందిన కుక్కల అరవింద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కమిటీ ఇతర పదవుల్లో గౌరవాధ్యక్షుడిగా శ్రీనివాస్, కోశాధికారిగా భారత్, గౌరవ సలహాదారుగా పెరుమాండ్ల రాజును ఎంపిక చేశారు. కమిటీ సభ్యులుగా మురళి, రాజు, హరీష్, క్రాంతి వ్యవహరించనున్నారు.
అగ్రి రంగంలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి నూతన కమిటీ కృషి చేయాలని ఈ సందర్భంగా సభ్యులు ఆకాంక్షించారు.