తేల్చుకుందాం రా’ అంటూ కడిగిన ముత్యాల్లాంటి తమ్ముళ్ల సవాళ్లు: పోరుమామిళ్లలో టీడీపీ వర్గ పోరు క్లైమాక్స్.. హైకమాండ్ గుండెల్లో రైళ్లు!
పోరుమామిళ్ల (కడప బ్యూరో): అక్టోబర్ 23 ప్రజావాణి జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కానీ, ప్రస్తుతం పోరుమామిళ్ల మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేడి మాత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక్కడ ప్రత్యర్థి పార్టీలతో యుద్ధం కంటే.. సొంత పార్టీలోనే సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. అధికార తెలుగుదేశం పార్టీ లో చాన్నాళ్లుగా ల్యాండ్మైన్లా దాగి ఉన్న అసమ్మతి, గ్రూపు రాజకీయాలు ఈ ఎన్నికల నామినేషన్ల పర్వంలో ఒక్కసారిగా బద్దలయ్యాయి. ఒకే పార్టీకి చెందిన...