prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 12:20 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

-​ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ…
-​ మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
– ​బతుకమ్మ దేవీ నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి.
– ​ప్రజలందరికీ బతుకమ్మ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.
​శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) శంకర్ నాయక్.

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం అక్టోబర్ 10

మిర్యాలగూడ నియోజకవర్గం
​ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గం ఆడపడుచులందరికీ బతుకమ్మ, దేవీ నవరాత్రులు, దసరా పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పిత్ర్య అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఐక్యతతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
​ఎక్కడ లేని విధంగా ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించింది తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎంగిలి పూవ్వుతో ప్రారంభమయ్యే బతుకమ్మ, దేవీ నవరాత్రుల పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలందరికీ, దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.