*తెలంగాణ సంస్కృతి,* *సంప్రదాయాలకు ప్రతీక* *బతుకమ్మ*
*తెలంగాణ రాష్ట్ర* *ప్రజలందరికీ బతకమ్మ* *పండుగ శుభాకాంక్షలు.*
*బతుకమ్మ, దేవీ* *నవరాత్రులు ప్రశాంతంగా* *జరుపుకోవాలి*
*ప్రజలందరికీ బతుకమ్మ,* *శరన్నవరాత్రుల* *శుభాకాంక్షలు*
*పెన్గన్ పత్రిక ఎడిటర్,* *సిఈఓ. రాయికోటి* *నర్సింలు*
*✍️ ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 10 సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి*
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా ఆడపడుచులందరికీ పెన్ గన్ పత్రిక ఎడిటర్ సిఈఓ రాయికోటి నర్సింలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శనివారం పితృ అమావాస్యతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతో పాటు ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రోత్సవాలు ఐక్యతతో, ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎక్కడా లేనివిదంగా ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే బతుకమ్మ తెలంగాణ ఉద్యమంతో ఖండాంతరాలకు విస్తరించిందని తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎంగిలి పువ్వుతో ప్రారంభమయ్యే బతుకమ్మ, దేవీ నవరాత్రుల పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఆయన బతుకమ్మ, దేవీ శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.