తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిన బతుకమ్మ వేడుకలు
మేడ్చల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు మేడ్చల్: మేడ్చల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ జి. అరుంధతి, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ, బతుకమ్మల చుట్టూ ఆడిపాడి సందడి చేశారు....