తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకే ముందస్తు అరెస్టులా…?
తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకే ముందస్తు అరెస్టులా? ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్.. ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బెజ్జంకి, అక్టోబర్ 26 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏళ్ల పాటు పోరాడి, లాఠీ దెబ్బలు తిని, జైళ్లకు వెళ్లిన ఉద్యమకారులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అరెస్టులు తప్పడం లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడటంపై వారు ప్రశ్నించారు. తెలంగాణ...