తెలంగాణలో తరహా విఅర్ఎలకి పే స్కేలు అమలు చేయాలి
అనంతపురం అక్టోబర్ 1 ప్రజావాణి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిచేసే వీఆర్ఏలకు పే స్కేలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా వీఆర్ఏల సంఘం జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమం కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 20వేల మందికి పైగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారు, నామినీలగా పనిచేస్తున్నా గ్రామ రెవెన్యు సహాయకులను అందరిని వన్ టైం సెటిల్మెంటుగా పర్మినెంట్ చేయాలన్నారు. మరణించినా విఅర్ఎల కుటుంబములో వయసుతో సంబందం లేకుండ తిరిగిఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం వీఆర్ఏలకు ఇస్తున్న వేతనం ఏమాత్రం సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్ని ఆవేదన వ్యక్తం చేశారు అంతే కాకుండా తెలంగాణలో తరహా జీతం పెంచాలన్నారు లేని పక్షాన దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లాలో పనిచేస్తున్న మండలాల వీఆర్ఏలు గ్రామ సహాయకులు తదితరులు పాల్గొన్నారు