తులసి కోట బతుకమ్మతో ప్రత్యేక ఆకర్షణగా మొలుగు శ్రావణి

తులసి కోట బతుకమ్మతో ప్రత్యేక ఆకర్షణగా మొలుగు శ్రావణి! తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన వినూత్న అలంకరణ కూకట్‌పల్లి, అక్టోబర్ 12 (ప్రజావాణి): కూకట్‌పల్లిలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో మొలుగు శ్రావణి రూపొందించిన తులసి కోట బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూలతో తులసి కోట రూపంలో బతుకమ్మను అందంగా తీర్చిదిద్ది, తెలంగాణ సంప్రదాయాల పట్ల తనకున్న అభిమానాన్ని ఆమె చాటుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో శ్రావణి వినూత్న అలంకరణ స్థానికులను...