prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 8:41 pm Digital Edition : PRAJA VANI

తుఫానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధం

తుఫానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధం:

*హోంమంత్రి అనిత*

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అమరావతి అక్టోబర్ 27

ఆంధ్రప్రదేశ్‌లో తుఫానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచామని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112ను సంప్రదించాలని హోంమంత్రి సూచించారు.