తుఫానుకు నేలకొరిగిన చేతికొచ్చిన పంట!

తుఫానుకు నేలకొరిగిన చేతికొచ్చిన పంట! కష్టమంతా నేలపాలు.. రైతన్న ఆశలపై ప్రకృతి పంజా.. కంటతడి పెట్టిస్తున్న పంట నష్టం గరిడేపల్లి (ప్రజావాణి): రెక్కలు ముక్కలు చేసుకొని.. రేయింబవళ్లు శ్రమించి.. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ పండించిన పంట చేతికొచ్చే సమయానికి తుఫాను రూపంలో ప్రకృతి విరుచుకుపడింది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట నేలకొరగడంతో అన్నదాత గుండె పగిలిపోతోంది. కళ్లముందే నెలల తరబడి పడిన కష్టం నేలపాలవుతుంటే రైతన్న కన్నీటిని ఆపుకోలేకపోతున్నాడు. విత్తనం నాటిన నాటి నుంచి పంట ఎదిగే...