prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 5:38 pm Digital Edition : PRAJA VANI

తుక్కపురం గ్రామంలో మహిళా శక్తి భవన ప్రారంభోత్సవం

*తుక్కపురం గ్రామంలో మహిళా శక్తి భవన ప్రారంభోత్సవం…*

*గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02*

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ జనగాం పాండు తో కలిసి పలు అభివృద్ధి కార్య క్రమాలలో పాల్గొని ప్రారంభించిన భువనగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళ శక్తి భవనాన్ని ప్రారంభించడంతోపాటు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా ఆయన మహిళా స్వయం ఉపాధి హార్దిక స్వావలంబన ఇటువంటి భవనాలు ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్క రించారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన సత్యం అహింస గ్రామ స్వరాజ్యం మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శ పాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగాం పాండు , జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అవేస్ చిస్తి , పిఎసిఎస్ చైర్మన్ ఫక్కీర్ కొండల్ రెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి , భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి , ఇతర ప్రజా ప్రతినిధులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ఉపసర్పంచ్ , గ్రామ పాలకవర్గ సభ్యులు , మహిళా సంఘాల ప్రతి నిధులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.