*తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్…*
*ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఆయిలయ్య.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 26*
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఆయిలయ్య సోమవారం రోజున దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో , ఆయురారోగ్యాలతో జీవించాలని , తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి , సంక్షేమ రంగాల్లో మరింత ముందుకు సాగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య అన్యోన్యత , సోదరభావం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే , పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో ప్రభావం తొలగి పోయి , సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండా లని , ప్రజలందరికీ ప్రకృతి అనుకూలించి రాష్ట్రాలు పాడిపంటలతో కళకళ లాడాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వేడు కున్నారు. ఈ కార్య క్రమంలో బీర్ల శంకర్ , చీర శ్రీశైలం తదితరులు పాల్గొనడం జరిగింది.