prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 11:52 am Digital Edition : PRAJA VANI

తిమ్మాయిపల్లిలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

తిమ్మాయిపల్లిలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

సరస్వతీ దేవి అవతారంలో దుర్గమ్మ.. భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు

బెజ్జంకి, అక్టోబర్ 16 (ప్రజావాణి):

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో హనుమాన్ దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తి పారవశ్యంతో వైభవంగా కొనసాగుతున్నాయి.ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.పురోహితులు వంశీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారి సన్నిధికి చేరుకుని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేసి,తమ కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని,గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
నవరాత్రి ఉత్సవాలతో తిమ్మాయిపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.