తాడేపల్లిలో రాజకీయ సందడి: వైఎస్ జగన్, సజ్జలతో కడప జిల్లా సీనియర్ నేత పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కీలక భేటీ!
తాడేపల్లి విజయవాడ)అక్టోబర్ 1 ప్రజావాణి రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు,కడప జిల్లా పోరుమామిళ్ల ప్రముఖ వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీ పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కడప జిల్లాలో పార్టీ బలోపేతం,భవిష్యత్తు కార్యాచరణపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు...