తాడివారిపల్లి ఘాట్ రోడ్డులో మెడిసిన్స్ వాహనం బోల్తా.తృటిలో తప్పిన పెను ప్రమాదం

తాడివారిపల్లి ఘాట్ రోడ్డులో మెడిసిన్స్ వాహనం బోల్తా.తృటిలో తప్పిన పెను ప్రమాదం ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 తర్లపాడు, మoడలం మార్కాపురం జిల్లా స్టీరింగ్ పనిచేయక మూలమలుపు వద్ద అదుపుతప్పిన వాహనం.. డ్రైవర్, హెల్పర్కు తప్పిన ముప్పు మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లి సమీపంలోని ఒంగోలు-కర్నూలు ప్రధాన రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఒంగోలు నుంచి కంభం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మందులు తరలిస్తున్న వాహనం ఘాట్ రోడ్డులోని ఓ ప్రమాదకరమైన మూలమలుపు వద్ద స్టీరింగ్ పనిచేయక అదుపుతప్పి బోల్తా పడింది....