తల్లుల చేతుల్లో పూల జాతర – పెద్దలకు ప్రేమతో బియ్యం పంపిణీ.

(ప్రజావాణి ములుగు జిల్లా) ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) లక్ష్మీదేవిపేట గడ్డపై బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. ఆడపడుచుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రతి ఇంటి ముందు పూలతో బతుకమ్మలు ముస్తాబవుతున్నాయి. తంగేడు, గునుగు, బంతి పూలతో పసర వీధులన్నీ రంగులమయం అయ్యాయి. ఈ రోజు బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు. ఇది మన ఆడబిడ్డల ఆత్మబంధం. మన సంస్కృతికి ప్రతిరూపం. తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను అత్యంత భక్తితో కొలుస్తారు. ప్రకృతికి కృతజ్ఞత చెప్పే గొప్ప పండుగ...