తల్లి వర్ధంతి సందర్భంగా చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ
కూసుమంచి, అక్టోబర్ 24 (ప్రజావాణి) ప్రతినిధి rk :
పాలేరు నియోజకవర్గ బీసీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు గంజి ఉదయ్ కుమార్ తన తల్లి గంజి సుజాత 8వ వర్ధంతిని పురస్కరించుకుని కూసుమంచి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి, బిస్కెట్లు పంపిణీ చేశారు.
తల్లి జ్ఞాపకార్థంగా పాఠశాలలోని చిన్నారులకు చెక్‌మార్కర్లు, పెన్సిళ్లు, ఎరేజర్లు, బిస్కెట్లు అందజేశారు.
తల్లి వర్ధంతి సందర్భంగా చిన్నారులకు ఉపయోగపడే విధంగా విద్యా సామగ్రి పంపిణీ చేయడం ద్వారా ఆమె జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించే అవకాశం కల్పించిన పాఠశాల ఉపాధ్యాయులకు గంజి ఉదయ్ కుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంతో పాటు విద్యార్థులను ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.