prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 8:38 pm Digital Edition : PRAJA VANI

తల్లిదండ్రులు పిల్లల దిన చర్యలను గమనించాలి

తల్లిదండ్రులు పిల్లల దిన చర్యలను గమనించాలి

లింగాపూర్ లో కార్టన్ సెర్చ్ సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన

హుస్నాబాద్ ఏసిపి సదానందం

మద్దూరు అక్టోబర్27 ప్రజా వాణి,

దూలిమిట్ట మండలంలోని లింగపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి హుస్నాబాద్ ఏసిపి సదానందం పర్యవేక్షణలో కార్టన్ సెర్చ్ తో పాటు సైబర్ క్రైమ్,గంజాయి, మత్తు పదార్థాలు, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని హుస్నాబాద్ ఏసిపి సదానందం గ్రామస్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పలు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయడంతో పాటు ఇన్సూరెన్స్, అర్ సి, వాహనాల ధృవ పత్రాలు లేనివారికి జరిమానా విధించారు. అదే మరోసారి వాహనాలకు ధ్రువపత్రాలు లేకపోతే సీజ్ చేస్తామని ఏ సి పి హెచ్చరించారు. ముక్యంగా తల్లిదండ్రులు పిల్లల దిన చర్యపై దృష్టి సారించాలని ఆ బాధ్యత తల్లిదండ్రుల పై ఉందన్నారు. యువత సైబర్, మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవొద్దని నేరాలకు పాల్పడి తల్లిదండ్రులకు కష్టాలు కన్నీరుతెచ్చిపెట్టి కటకాల పాలు కావొద్దన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి,చేర్యాల సి ఐ రమేశ్,మద్దూరు,చేర్యాల, అక్కన్నపేట, కొహెడ పోలీస్ స్టేషన్ ఎస్సైలు, గ్రామస్థులు పాల్గొన్నారు