*ఢిల్లీ ఇందిరా ఘాట్ వద్ద నివాళులర్పించిన భువనగిరి కాంగ్రెస్ నాయకులు…*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31*
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో శనివారం రోజు ఢిల్లీలో స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఇందిరా గాంధీ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎల్లెంల జంగయ్య యాదవ్ , పి ఏ సి ఎస్ చైర్మన్లు పక్కిర్ కొండల్ రెడ్డి , సతీష్ పవన్ , భువనగిరి ఆత్మ కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం , భువనగిరి కౌన్సిలర్ తాహేరా బబ్లు భాయ్ , కునూరు గ్రామ సర్పంచ్ పాశం శివానంద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నానం కృష్ణ , గాద కర్ణాకర్ లు పాల్గొన్నారు.