prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 1:07 pm Digital Edition : PRAJA VANI

డీజేలు పెడితే కేసులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్

డీజేలు పెడితే కేసులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్

ఎస్సై వంశీకృష్ణ హెచ్చరిక

అక్టోబర్ 21 ప్రజావాణి న్యూస్ /సంగెం

సంగెం మండలంలోని దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఊరేగింపుల్లో డీజేలు ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వంశీకృష్ణ హెచ్చరించారు. నిమజ్జన ఊరేగింపులో డీజేలు ఉపయోగిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా వినియోగించే డీజేలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని, పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు సహకరించాలని ఎస్సై వంశీకృష్ణ సూచించారు.