డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి స్థానిక డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ కార్లో, ఫాదర్ శౌరి, ప్రిన్సిపాల్ ఫాదర్ అనూప్, వైస్ ప్రిన్సిపాల్ వినోద్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు....