డాక్టర్ గురువారెడ్డి ఆధ్వర్యంలో కొండాపూర్ దుర్గాదేవి పూజలు
ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో లెజెండ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ డి గురువారెడ్డి పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వెల్గటూర్ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, మన్నె జితేందర్, స్థానిక ఉపసర్పంచ్ తనుగుల విజయ్, లెజెండ్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.