prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 9:22 am Digital Edition : PRAJA VANI

ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు

ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కఠిన చర్యలు
నిబద్దతతో వ్యాపారం చేయాలి

* మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి

జమ్మికుంట అక్టోబర్ 6 (ప్రజావాణి)

మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని షాపుల యజమానులు ట్రేడ్ లైసెన్స్ తీసుకొని తమ వ్యాపారాన్ని నిబద్ధత కొనసాగించాలని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తెలిపారు. మంగళవారం జమ్మికుంట బస్టాండ్ ఎదురుగా గల లక్ష్మీపతి కిరాణం యజమాని సూదం శివకుమార్ గత కొన్ని సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నాడని ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసిన స్పందించకపోవడంతో సానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్ లక్ష్మీపతి కిరాణం షాపుకు తాళం వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్ని అనుమతులతో వ్యాపారం చేసుకుంటే మున్సిపల్ సిబ్బంది సహకరిస్తారని నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే మున్సిపల్ ఆక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా అనుమతులు తీసుకోకుండా వ్యాపారం చేస్తే ఇలాంటి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది కొలువురి కిరణ్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు