ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై నేడు స్పెషల్ డ్రైవ్
కమాన్ నుంచి జెండా చౌరస్తా వరకు ప్రత్యేక తనిఖీలు
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, అక్టోబర్ 6:
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ యస్ ఐ నరేష్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.
సాయంత్రం 5.30 గంటలకు కమాన్ నుంచి జెండా చౌరస్తా మధ్యలోని వై జంక్షన్ కూడలి వద్ద ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ బి. శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ సమయంలో హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగించాలని, అవసరమైన వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు సూచించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌ను కవర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు