ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం.. సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాం

ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం.. సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాం శంకర్‌నగర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్ సిద్దిపేట,అక్టోబర్ 5 (ప్రజావాణి) కంటికి రెప్పలా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. కోహెడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంకర్‌నగర్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని సీపీ రష్మి పెరుమాళ్ సోమవారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించిన ఆమె.. ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓను ఆదేశించారు.ఈ సందర్భంగా...