prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 6:47 pm Digital Edition : PRAJA VANI

ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం.. సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాం

ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం.. సురక్షితంగా ఇళ్లకు చేరుకుందాం

శంకర్‌నగర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన

సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్

సిద్దిపేట,అక్టోబర్ 5 (ప్రజావాణి)

కంటికి రెప్పలా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. కోహెడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంకర్‌నగర్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని సీపీ రష్మి పెరుమాళ్ సోమవారం పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించిన ఆమె.. ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవలచోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తంచేశారు.వాహనదారుల అజాగ్రత్త, త్రిపుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం వంటి కారణాలతో ప్రమాదాలుజరుగుతున్నాయని తెలిపారు. చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తుందని పేర్కొన్నారు.ద్విచక్ర వాహనదారులతో పాటు వెనుక కూర్చున్న వారు కూడా నాణ్యమైన హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. బైక్‌పై ఇద్దరికి మించి ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, త్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగం, రాంగ్‌రూట్‌లో ప్రయాణం, అతివేగాన్ని నివారించాలని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీ జరిమానాలతో పాటు చట్టప్రకారం శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.రహదారులపై హెచ్చరిక సంకేతాలు, హజార్డ్ లైట్లు లేకుండా వాహనాలను పార్కింగ్ చేయవద్దని, అలాంటి వాహనాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.పాదచారులు కూడా నిర్దేశిత ప్రాంతాల్లోనే రోడ్డు దాటాలని, ఇరువైపులా చూసుకుని జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు.
త్వరగా వెళ్లడం కంటే సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను రోజువారీ అలవాటుగామార్చుకోవాలని సీపీ రష్మి పెరుమాళ్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సురక్షిత ప్రయాణం కోసం పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు.