టేకు చెట్ల దొంగల ముఠా అరెస్ట్ – 132 దుంగలు స్వాధీనం

ఎండపల్లి మండలం పాతగూడూర్ కు చెందిన రామరావు పొలంలో టేకు చెట్ల దొంగతనంపై వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులతో ధర్మపురి సిఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు అవైజ్, ఖాజీ రహమాన్ అలీ, అర్సద్, షౌకత్ అలీ అనే నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 132 టేకు దుంగలు, అశోక్ లేలాండ్ ఆటో, బైక్, ఎలక్ట్రిక్ రంపం స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు.