prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 4:54 pm Digital Edition : PRAJA VANI

టీ ఆర్ పి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్

టీ ఆర్ పి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్

విజేతకు రూ.40 వేలు.. రన్నరప్‌కు రూ.20 వేలు

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 12

కామారెడ్డి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి బిచ్కుందలో పట్టణం లోని పాలగుండం గ్రౌండ్‌లో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. విజేత జట్టుకు రూ.40 వేలు, రన్నరప్‌కు రూ.20 వేల నగదు బహుమతి అందజేయనున్నారు. జట్ల ఎంట్రీ ఫీజు రూ.1,100గా నిర్ణయించారు.
పాల్గొనే జట్లు ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పేర్లు నమోదు చేసుకోవాలి. అదే రోజు రాత్రి 8 గంటలకు డ్రా తీస్తారు. ప్రతి మ్యాచ్‌ 8 ఓవర్ల పాటు నిర్వహించనుండగా, ఒక్కో జట్టులో 11 మంది ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. ఒక జట్టులో ఆడిన ఆటగాడు మరో జట్టులో ఆడేందుకు అనుమతి లేదు. అంపైర్‌ నిర్ణయమే తుది నిర్ణయమని, మేనేజ్‌మెంట్‌ నిబంధనలకు కట్టుబడి ఉండాలని నిర్వాహకులు తెలిపారు.మరిన్ని వివరాలకు జాదవ్ ఈశ్వర్‌ (98661 37828), ఆరిఫ్‌ (93900 58348)ను సంప్రదించాలని సూచించారు.