*టిబి ముక్త్ పంచాయితీ 2025 -26 అవార్డు ప్రధానం…*
*అందుకున్న కాల్వపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఇంజ లక్ష్మీ.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 08*
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కాల్వ పల్లి గ్రామ పంచాయతీ ఆరోగ్యశాఖ విషయంలో జిల్లాలో బెస్ట్ గ్రామ పంచాయతీ గా నిలిచింది. గురువారం రోజు కలెక్టరేట్ లో జరిగిన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ రివ్యూలో తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ టిబి ముక్త్ కాల్వపల్లి సర్టిఫికెట్ ను జిల్లా వైద్యా రోగ్య శాఖ డి ఎం హెచ్ ఓ , పంచాయతీరాజ్ , జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ అవేస్ చిస్తి , మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి , జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. సహక రించిన గ్రామ మండల ఆరోగ్యశాఖ అధికారులకు గ్రామ ప్రజలకు సర్పంచ్ ఇంజ లక్ష్మీ ప్రత్యేక ధన్య వాదాలు తెలియజేశారు.