టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో కీలక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు భేటీ
రాష్ట్ర రాజకీయాలు, జుక్కల్ నియోజకవర్గ పరిణామాలు, ఎల్నినో ప్రభావం, ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై చర్చ
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 24
హైదరాబాద్లోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మైనారిటీల సంక్షేమ కమిటీ చైర్మన్ తోట లక్ష్మీకాంతరావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, జుక్కల్ నియోజకవర్గంలో తాజా పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, నాయకుల మధ్య సమన్వయం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, పార్టీ లక్ష్యాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో సమన్వయంతో ముందుకు సాగాలని ఈ భేటీ సందర్భంగా ఆకాంక్షించారు.