టిపిటిఎఫ్ నెల్లికుదురు మండల కమిటి ఏకగ్రీవం..
అధ్యక్షులు యాకయ్య ప్ర.కార్యదర్శి శ్రీనివాస్
ప్రజావాణి,నెల్లికుదురు,తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి పి టి ఎఫ్)నెల్లికుదురు మండల శాఖ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. మండల అధ్యక్షులుగా వై. యాకయ్య,ప్రధాన కార్యదర్శిగా సంగ శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు.దీనికి ముఖ్యఅతిథిగా టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత,ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి కె .జనార్ధన్,ఎన్నికల పరిశీలకులుగా రవీందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి లు హాజరై ఎన్నిక నిర్వహించారు.ఉపాధ్యక్షులుగా బీ.బిక్షపతి,కే .నవీన్, నిక్కత్ న్నిసా బేగం, హరినాథ్ బాబు, కార్యదర్శులుగా ఎం. మధుసూదన్ ,కే .సంపత్ రెడ్డి ,ఈ .మధుబాబు, ఎస్. ప్రవీణ్ కుమార్ జిల్లా కౌన్సిలర్స్ గా కే .వెంకటేశ్వర్లు , కే .బిక్షపతి ,కే. పద్మావతి ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి. శ్రీనివాస్, సభ్యులుగా ఈ .కరుణాకర్ ,బి. సంపత్ అకాడమిక్ సెల్ కన్వీనర్ గా ఎం.డి .సలీం ,సభ్యులుగా శ్రీనివాస చారి, జి. మధు, జీవోల కమిటీ కన్వీనర్ గా కే. వెంకటేశం, పి .రమేష్ లు ఎన్నికయ్యారు.
ఈ మేరకు ఎన్నికల అధికారి కే.జనార్ధన్ పరిశీలకులు రవీందర్ రెడ్డిలు నూతన కమిటీని ప్రకటించారు.

*పిఅర్సిని అమలు చేయాలి: స్టేట్ నేత కవిత*
ప్రభుత్వం పిఆర్సి కమిటీ రిపోర్టును వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని టి పి టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .కమిటీ కాలపరిమితి దాటినా ప్రభుత్వం కాల యాపన చేస్తున్నదని విమర్శించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.