టిడిపి మండల అధ్యక్షుడు భైరవ ప్రసాద్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
పోరుమామిళ్ల: ఆగస్టు 23 ప్రజావాణి పోరుమామిళ్ల మండల పరిధిలో స్థానిక సంస్థల (ఎంపీటీసీ, ఎంపీపీ) ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకుని చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తీవ్ర కలకలం రేపాయి. ఒకే రాజకీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు భౌతిక దాడుల వరకు దారితీయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర ఆగ్రహం మరియు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.టీడీపీ పార్టీకి మండల అధ్యక్షుడు భైరవ ప్రసాద్‌పై అదే పార్టీకి చెందిన చెరుకూరి రవి కొందరు వ్యక్తులు అమానుషంగా...