prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 8:21 am Digital Edition : PRAJA VANI

జోగిపేట 15వ వార్డులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

జోగిపేట 15వ వార్డులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

• రజక సంఘం ఆడపడుచులకు చిరు కానుకలు అందజేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు)

మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 16 (జోగిపేట) జిల్లా ప్రతినిధి

అందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో బతుకమ్మ పండుగ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. రజక సంఘానికి చెందిన ఆడపడుచులు ప్రతి ఇంటి నుంచి రకరకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) ఆడపడుచులందరికీ చిరు కానుకలను అందజేశారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంట్లో సంతోషాలు, ఆనందాలు నింపాలని, ఆడపడుచులందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన రజక సంఘం ఆడపడుచులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం మహిళలు, పెద్దలు, యువకులు, చిన్నారులు పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.