జోగిపేటలో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
• మహిషాసుర మర్దిని అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారు.. భారీగా తరలివచ్చిన భక్తులు
మన ప్రజావాణి అక్టోబర్ 19 జోగిపేట: జిల్లా ప్రతినిధి
ఆందోల్-జోగిపేట పట్టణంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని పబ్బతి హనుమాన్ చౌరస్తా వద్ద స్నేహ సిరి మాత యూత్ ఆధ్వర్యంలో, క్లాక్ టవర్ సమీపంలో రుద్ర యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులుగా అమ్మవారికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అర్చక స్వాములచే విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మహిషాసుర మర్దిని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు.
ఉత్సవాల సందర్భంగా నిర్వాహకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారి మండపాలు భక్తులతో సందడిగా మారగా, పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.