prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 1:30 pm Digital Edition : PRAJA VANI

జోగిపేటలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జోగిపేటలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జోగిపేట, అక్టోబర్ 2 (ప్రజావాణి):

జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా జోగిపేట పట్టణంలోని చారిత్రక మధ్యరంగం (క్లాక్ టవర్) వద్ద ఉన్న పాలరాతి గాంధీ విగ్రహానికి బీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ డి.బి. నాగభూషణం, చాపల వెంకటేశం, సార శ్రీధర్, బిర్ల శంకర్, కరుణాకర్, సటికే రాజు, ఆకుల శంకర్, పల్లె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అహింస అనే ఆయుధంతో భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. గ్రామ స్వరాజ్యమే దేశానికి వెన్నుముక అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. మహాత్ముని ఆశయాలు, అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.