prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 4:52 pm Digital Edition : PRAJA VANI

జుక్కల్ లో వసుంధర పాదయాత్రికులకు ఘన స్వాగతం

జుక్కల్ లో వసుంధర పాదయాత్రికులకు ఘన స్వాగతం!

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 24

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని డోస్పల్లి గ్రామ శివారులో గల ప్రసిద్ధిగాంచిన నరేంద్ర మహారాజ్ పుట్టినరోజు పురస్కరించుకొని జుక్కల్ మండలం నుండి రత్నగిరి జిల్లా నానీజ్ ధామ్ కు 600 కిలోమీటర్ సాగిన వసుంధర పాదయాత్ర పూర్తి చేసుకుని జూకల్ కు చేరుకున్న నరేంద్ర చార్య స్వామి భక్తులకు ఘన స్వాగతం లభించింది.. పర్యావరణ, పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యత తదితర అంశాలపై, గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో మొక్కలు నాటుతూ గత ఈనెల 27 తేదీన జుక్కల్ మండలం దోస్పల్లి బంగారు పల్లి గ్రామ శివారులో కొలువై ఉన్న జగద్గురు స్వామి నరేంద్ర చార్యాజి మహారాజ్ యొక్క తెలంగాణ ఉప పీఠం నుండి వేలాదిమంది భక్తులతో ప్రారంభమైన వసుంధర 28 రోజులు పాటు పాల్గొని పాదయాత్ర శనివారం జుక్కల్ కు చేరుకోవడంతో ఉపపీఠం నిర్వాహకులు, యత్రికులకు ఘన స్వాగతం పలికారు..