జుక్కల్‌లో నేడు నియోజకవర్గ స్థాయి బతుకమ్మ సంబరాలు
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 12
జుక్కల్ మండల కేంద్రంలోని గుండూర్ రోడ్డు వద్ద నేడు నియోజకవర్గ స్థాయి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సతీమణి తోట అర్చన ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు వేడుకలు ప్రారంభం కానుండగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బతుకమ్మ పోటీల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.51 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు, మూడో బహుమతిగా రూ.11 వేలు అందజేయనున్నారు. మరో ఎనిమిది మందికి కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చాటడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. హాజరయ్యే వారందరికీ భోజన వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు.