జిల్లా స్థాయి ఆటల పోటీల్లో మద్దూరు కస్తూర్బా పాఠశాల విద్యార్థులు
మద్దూరు కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న
మద్దూరు అక్టోబర్29, ప్రజా వాణి,
తెలంగాణ రైసింగ్ 247 లో భాగంగా మండల స్థాయిలో బహుమతి పొందిన వారిని గురువారం జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించారు.మద్దూరు ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న గుజరాతి స్వామి స్పీడ్ వాకింగ్ (ఎలిమెంటరీ లెవెల్ లో) మొదటి బహుమతి సాధించారు. అదేవిధంగా కస్తూరిబా గాంధీ పాఠశాల మద్దూరులో 8వ తరగతి చదువుతున్న తలారి జోష్ణవి మహిళల స్పీడ్ వాకింగ్ లో మొదటి బహుమతి మరియు మ్యూజికల్ చైర్ లో రెండవ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి వరదరాజు కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న మరియు పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామేశ్వర్ రెడ్డి పిల్లలను మరియు ఐ ఆర్ పి లు లక్ష్మణ్ మనిషా మరియు స్పెషల్ ఎడిటర్ రాజశేఖర్ లను అభినందించారు.