జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గా బోడ సాయిలు ఎన్నిక
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 11
కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులుగా కౌలాస్ గ్రామ వాసి బోడ సాయిలు ఎన్నికయారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రం లో జరిగిన కార్యక్రమం లో అయన ఉపాధ్యక్షులు గా ప్రమాణ స్వీకారం చేశారు. జుక్కల్ నియోజకవర్గం లో పద్మశాలి సమాజం లో చురుకైనా పాత్ర పోషిస్తూ మార్కండేయ మందిరాల నిర్మాణానికి కృషి చేస్తున్నారు. బోడ సాయిలు సేవలను గుర్తించి ఆయన్ను జిల్లా ఉపాధ్యక్షులు గా ఎంపికచేయడం పట్ల జుక్కల్ వాసులు హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వాళ్లకాటి రాజకుమార్, జిల్లా అధ్యక్షులు సిరిగధ లక్ష్మి నరసింలు సమక్షలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనతో పాటు కార్యదర్శి గా మేర్గే దత్తాత్రి కార్యదర్శి గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం లో జుక్కల్ పద్మశాలి సంఘం నాయకులు దోమల అశోక్, దోమల నాగనాథ్, సుభాష్, దుర్కవర్ హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.