జిల్లా కలెక్టరేట్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
*జిల్లా కలెక్టరేట్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు* *ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ* *ఉత్సాహంగా పాల్గొన్న మహిళా అధికారులు, ఉద్యోగులు* మేడ్చల్ అక్టోబర్ 17 (ప్రజావాణి ):- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రకృతి ఆరాధన, మహిళల ఆత్మీయత, సామాజిక ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ వేడుకలు కలెక్టరేట్ ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులు, సిబ్బంది సంప్రదాయబద్ధంగా ఈ...