జాపాల్‌–మంచాల రోడ్డు నిర్మాణం చేపట్టాలి

*జాపాల్‌–మంచాల రోడ్డు నిర్మాణం చేపట్టాలి* *సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో* మంచాల, అక్టోబర్ 1 (ప్రజావాణి): జాపాల్‌ నుంచి మంచాల వరకు నిలిచిపోయిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం మంచాల గ్రామ శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మూడేళ్ల క్రితం రోడ్డు నిర్మాణానికి రూ.430 లక్షలు మంజూరైనట్లు శిలాఫలకం ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని సీపీఎం నాయకులు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు చేపట్టి కంకర పోసిన అనంతరం పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. దీంతో రహదారి...