జానకి నగర్లో సర్పంచ్ భర్త సేవా స్ఫూర్తి
జానకి నగర్లో సర్పంచ్ భర్త సేవా స్ఫూర్తి.. స్వయంగా రంగంలోకి దిగి రోడ్డు పక్కన చెట్ల తొలగింపు! చిలుకూరు, అక్టోబర్ 24: చిలుకూరు మండలం జానకి నగర్ గ్రామంలో ఈరోజు ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన చిన్నచిన్న పచ్చని చెట్లు, పిచ్చిమొక్కల వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ బానోతు అనుషా రవికుమార్ గారి భర్త స్వయంగా రంగంలోకి దిగారు. చెత్త, మొక్కలు కత్తిరించే యంత్రాన్ని తీసుకొని రోడ్డు పక్కన ఉన్న మొక్కలను స్వయంగా తొలగిస్తూ గ్రామ పరిశుభ్రతకు...