prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 9:23 pm Digital Edition : PRAJA VANI

జానకి నగర్‌లో సర్పంచ్ భర్త సేవా స్ఫూర్తి

జానకి నగర్‌లో సర్పంచ్ భర్త సేవా స్ఫూర్తి.. స్వయంగా రంగంలోకి దిగి రోడ్డు పక్కన చెట్ల తొలగింపు!
చిలుకూరు, అక్టోబర్ 24: చిలుకూరు మండలం జానకి నగర్ గ్రామంలో ఈరోజు ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన చిన్నచిన్న పచ్చని చెట్లు, పిచ్చిమొక్కల వల్ల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ బానోతు అనుషా రవికుమార్ గారి భర్త స్వయంగా రంగంలోకి దిగారు. చెత్త, మొక్కలు కత్తిరించే యంత్రాన్ని తీసుకొని రోడ్డు పక్కన ఉన్న మొక్కలను స్వయంగా తొలగిస్తూ గ్రామ పరిశుభ్రతకు తనవంతు సహకారం అందించారు.
సాధారణంగా ఇలాంటి పనులను సిబ్బందితో చేయించే అవకాశం ఉన్నప్పటికీ, గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత పట్ల తనకున్న బాధ్యతను చాటుతూ స్వయంగా పని చేయడం గ్రామస్థులను ఆకట్టుకుంది. ప్రజాప్రతినిధులు అంటే కేవలం పదవులకే పరిమితం కాకుండా, ప్రజల అవసరాలను గుర్తించి ముందుండి పనిచేయాలనే సందేశాన్ని ఈ ఘటన చాటిచెప్పింది.
సర్పంచ్ అనుషా రవికుమార్ గారి నాయకత్వంలో గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ఆమె భర్త స్వయంగా సేవా కార్యక్రమంలో పాల్గొనడం పట్ల గ్రామస్థులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులను బాధ్యతగా చేపడుతూ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.