prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 4:19 pm Digital Edition : PRAJA VANI

జానకి నగర్‌లో దుర్గాదేవి నవరాత్రుల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బానోతు హైమావతి

జానకి నగర్‌లో దుర్గాదేవి నవరాత్రుల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న బానోతు హైమావతి
చిలుకూరు మండలం, జానకి నగర్: దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా జానకి నగర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బానోతు హైమావతి, భర్త నాగేంద్ర నాయక్, అసిస్టెంట్ మేనేజర్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జానకి నగర్ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గ్రామంలో శాంతి, సామరస్యం, ఐక్యత వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థించారు.
దుర్గాదేవి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరికీ మంచి జరగాలని, గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.
దుర్గామాత ఆశీస్సులు జానకి నగర్ గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు.