జాతీయ స్థాయి క్రీడలకు కనగర్తి విద్యార్థి
జాతీయ స్థాయి క్రీడలకు కనగర్తి విద్యార్థి జావెలిన్ త్రోలో 40.34 మీటర్లు విసిరి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఒళ్ళే అక్షయ్ కార్తి కనగర్తి దాసరి పద్మ–హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఒళ్ళే అక్షయ్ కార్తి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై సత్తా చాటాడు. నవంబర్‌లో జరగనున్న 20వ జాతీయ అంతర్‌జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్–2026లో పాల్గొనే అవకాశం అక్షయ్ కార్తికి లభించింది. ఇటీవల నిర్వహించిన ఎన్‌ఐడీజేఏఎం జిల్లా టోర్నమెంట్‌లో 16 సంవత్సరాల విభాగం జావెలిన్ త్రోలో అక్షయ్...